Jr NTR: పిక్‌ టాక్‌: ఎన్టీఆర్‌ ఏడేళ్ల క్రితం ఇక్కడే..!

పాత ఫొటోలు, కొత్త ఫొటోలను కలిపి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం, అవి వైరల్‌గా మారడం మనం చాలాసార్లు చూసే ఉంటాం. సినిమా సెలబ్రిటీల ఫొటోలు అయితే ఇలా ఎక్కువగా జరుగుతుంటాయి. మనం కూడా పిక్‌ టాక్‌ పేరుతో ఇలాంటి ఫొటోలు చూపించాం. ఇప్పుడు అలాంటి ఒక ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అందులో ఉన్న యంగ్‌ టైగర్‌ తారక్‌. అవును తారక్‌ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నాడు కదా… అక్కడి ఫొటోనే ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

తారక్‌ తన కుటుంబంతో ఇటీవల పారిస్‌ టూర్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్విట్జర్లాండ్‌ను చుట్టేస్తున్నాడు తారక్‌. అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో మరికొన్ని ఫొటోలు కూడా బయటకు వస్తున్నాయి. అందులో ఒకటి మంచు ప్రాంతంలో దిగిన ఫొటో ఉంది. ఎన్టీఆర్‌ వెనుక తన కజిన్‌ ఉన్న ఫొటో అది. అయితే 2014లో అంటే ఏడేళ్ల క్రితం ఇలాంటి పోజే ఒకటి ఎన్టీఆర్‌ ఇచ్చాడు. ఆ ఫొటోను, ఈ ఫొటోను కలిపి ఇప్పుడు షేర్‌ చేస్తున్నారు.

దీంతోపాటు ఐఫిల్‌ టవర్‌ దగ్గర కూడా దిగిన మరో ఫొటో కూడా వైరల్‌ అవుతోంది. అందులోనూ ఎన్టీఆర్‌ పక్కన కజిన్‌ ఉన్నాడు. అంటే తారక్‌ పూర్తిగా ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడన్నమాట. వరుస సినిమాలతో మన హీరోలు బిజీగా ఉన్నా… ఎప్పటికప్పుడు ఫ్యామిలీకి టైమ్‌ కేటాయిస్తూ టూర్లకు వెళ్తున్నారు. ఎన్టీఆర్‌, మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌ హీరోలు ఈ పని చేస్తున్నారు.

1

2

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus