Jr NTR: ఈసారి మామూలుగా ఉండదు అంటున్న తారక్‌ అభిమానులు!

ఒక పక్క కొంతమంది హీరోలకు సినిమాలే సెట్ అవ్వకపోతుంటే, మరోపక్క ఇంకొంతమంది హీరోలకు మల్టీస్టారర్‌లు సెట్‌ అయిపోతున్నాయి. అవును టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్‌ ఓకే అయినట్లు తెలుస్తోంది. అంతే కాదు ఇది టాలీవుడ్‌ – కోలీవుడ్‌ కలగలిపిన మల్టీస్టారర్‌ అట. తెలుగు నుండి ఎన్టీఆర్‌, తమిళం నుండి విజయ్‌ నటిస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. దీంతో రెండు వుడ్స్‌లో అభిమానుల ఆనందంగా మామూలుగా లేదు. ఈ సినిమా దర్శకత్వం వహించేది కూడా మనందరికీ బాగా తెలిసిన వ్యక్తే.

తమిళంలో విజయ్‌ హీరోగా అట్లీ చాలా సినిమాలు చేశాడు. అంతేకాదు అన్నీ మంచి హిట్‌ కొట్టాయి. అట్లీ ఇచ్చే ఎలివేషన్స్‌, సీన్స్‌, మాస్‌ లుక్‌ ఎన్టీఆర్‌కు బాగుంటాయని అందరూ అనుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ – అట్లీ కాంబినేసన్‌లో ఓ సినిమా ఉంటుందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అభిమానుల కోరిక బలంగా కోరినట్లున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ కొత్త మల్టీస్టారర్‌కు అట్లీనే దర్శకుడు. మల్టీస్టారర్‌ అన్నారు కదా మరో హీరో ఎవరనేగా… ఇంకెవరు విజయ్‌నే.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎన్టీఆర్‌ కొరటాల శివ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా అయిన వెంటనే అట్లీ సినిమా స్టార్ట్‌ చేస్తారని తెలుస్తోంది. కథ తదితర విషయాలు ఇంకా బయటకు రాకపోయినప్పటికీ సండే గాసిప్‌గా ఈ వార్త అయితే హల్‌చల్‌ చేస్తోంది. అట్లీ, ఎన్టీఆర్‌ సినిమా వస్తే దానికి దిల్‌ రాజు నిర్మాత అవ్వొచ్చని గతంలో వార్తలొచ్చాయి. మరోవైపు దిల్‌ రాజు తమిళ ఇండస్ట్రీలోనూ సినిమా తీయాలని చాలా రోజుల నుండి చూస్తున్నారు. సో ఈ మల్టీస్టారర్‌కి ఆయన నిర్మాత అవుతారేమో.


వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus