Buchi Babu: ఉప్పెన దర్శకుడికి హ్యాండ్ ఇవ్వడుగా..

  • June 6, 2021 / 10:23 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో దర్శకులకు హీరోలకు ప్రాజెక్టులు అంత ఈజీగా సెట్టవ్వడం లేదు. ఎన్నో చర్చలు జరిపితే గాని హీరోలు ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా కంప్లీట్ స్క్రిప్ట్ కావాలని అంటున్నారు. ముందుగా ఒక స్టోరీ లైన్ విని పాజిటివ్ గానే స్పందిస్తున్న హీరోలు ఆ తరువాత స్క్రిప్ట్ మొత్తం విన్నాక మాత్రం ఝలక్ ఇస్తున్నారు. స్క్రిప్ట్ లో ఏ మాత్రం తేడా అనిపించినా రిజెక్ట్ చేసేస్తున్నారు. కొన్నిసార్లు వేరే కారణాల వల్ల కూడా నో చెప్పాల్సి వస్తోంది.

ఇటీవల ఎన్టీఆర్ త్రివిక్రమ్ కథను ఎలా రిజెక్ట్ చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా ఆలోచనతో త్రివిక్రమ్ లోకల్ కథను ఓకే చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు బుచ్చిబాబు ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం వలన కథ సెట్ చేస్తున్నాడు. లోకల్ కథను గ్లోబల్ గా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. తారక్ స్టోరీ లైన్ విని పాజిటివ్ గా స్పందించాడు. కానీ కాన్ఫిడెంట్ గా చేస్తానని చెప్పలేదట. ఫుల్ స్క్రిప్టు విన్న తరువాతే నిర్ణయాన్ని చెబుతానని అన్నాడట.

ఇక బుచ్చిబాబు నమ్మకంతో బౌండెడ్ స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి. ఇక ఉప్పెన హిట్టుతో బుచ్చిబాబుకి వేరే నిర్మాతల నుంచి ఆఫర్స్ వస్తున్నప్పటికీ మైత్రి మూవీ మేకర్స్ లోనే సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఎన్టీఆర్ ఒప్పుకుంటే అతని కెరీర్ మరోసారి యూ టర్న్ తీసుకున్నట్లే..

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus