Jr NTR: తారక్ ఫ్యాన్స్ కోరిక తీర్చనున్న ప్రశాంత్ నీల్..?

టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా సత్తా చాటుతారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏపీలో టీడీపీ రోజురోజుకు బలహీనపడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ పాలిటిక్స్ లో యాక్టివ్ అయితే మాత్రమే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని టీడీపీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో ఖచ్చితంగా

తెలియకపోయినా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో మాత్రం పవర్ ఫుల్ పొలిటీషియన్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మొదట ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ జవాన్ గా కనిపిస్తారని వార్తలు వచ్చినా ఎన్టీఆర్ పొలిటీషియన్ గా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.పొలిటికల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుండగా ప్రశాంత్ నీల్ ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేశారని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు 10 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని తెలుస్తోంది. షూటింగ్ మొదలైన తరువాత ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ హీరోయిన్ ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎన్టీఆర్ పొలిటీషియన్ గా కనిపించాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తుండగా ప్రశాంత్ నీల్ సినిమాతో ఫ్యాన్స్ కోరిక తీరనుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus