Jr NTR: ఫ్యాన్స్‌కి షాక్‌.. ఆస్కార్‌ కోసం సినిమా కీలక ఘట్టం వదలుకుంటున్న ఎన్టీఆర్‌!

‘ఆర్ఆర్‌ఆర్’ సినిమాకు సంబంధించి ప్రచారంలో, అవార్డ్స్‌ కార్యక్రమంలో రామ్‌చరణ్‌, ఎన్టీర్‌ను చూసి పండగ చేసుకున్నారు ఫ్యాన్స్‌. సినిమాలో కాసేపే చూశాం.. కానీ ఇలా బయట ఇంతసేపు చూసే అవకాశం రావడంతో వాళ్లంతా హ్యాపీ. అయితే హెచ్‌సీఏ అవార్డ్స్‌లో రామ్‌ చరణ్‌ ఒక్కడే పాల్గొన్నాడు. అతనిలోపాటు రాజమౌళి, కార్తికేయ, సెంథిల్‌, కీరవాణి కూడా వెళ్లారు అనుకోండి. కానీ చరణ్‌తోపాటు తారక్‌ కూడా ఉంటే బాగుండు అనిపించింది. అయితే ఆస్కార్‌ వేదిక మీద ఆ సీన్‌ చూడొచ్చు.

దానికి తగ్గ ఏర్పాట్లు జరిగిపోయాయి అని సమాచారం. చరణ్‌ – తారక్‌ ఒక వేదిక మీద, అందులోనూ ఆస్కార్‌ లాంటి వేదిక మీద కనిపిస్తే ఆ లెక్కే వేరు. ఈ ఫీల్‌ కోసం తారక్‌ తన కొత్త సినిమా ముహూర్తాన్ని కూడా వదులుకుంటున్నాడని టాక్‌. ఎన్టీఆర్ 30వ సినిమా, కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. దీని కోసం ఎప్పటినుండో వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ముహూర్తం కార్యక్రమం జరిగి ఉండాల్సింది.

అయితే నందూమరి తారకరత్న కన్నుమూయడంతో సినిమా ముహూర్తం వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను అక్టోబరు 5న ప్రారంభించాలని అనుకున్నారట. అయితే అదే రోజు తారక్‌ అమెరికా ప్రయాణం ఉంది అంటున్నారు. దీంతో ఎన్టీఆర్ తన సినిమా ప్రారంభోత్సవానికి హాజరు కావడంలేదని తెలుస్తోంది. మార్చి 12న జరుగనున్న ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌తో కలసి తారక్‌ పాల్గొనేలా ముందుగానే ఐదో తేదీన ఫ్లైట్‌ టికెట్స్‌ బుక్‌ చేసేశారట.

ఈ కారణంగానే సినిమా ముహూర్తానికి తారక్‌ ఉండటం లేదట. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా లోని ‘నాటు నాటు…’ పాట ఆస్కార్‌ అవార్డుల్లో నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్న ఈ పాట ఆస్కార్‌ కూడా గెలుచుకుంటుందని ఫ్యాన్స్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ ముచ్చట కూడా తీరిపోతే చాలు. అప్పుడు ప్రపంచం మొత్తం నాటు నాటు అంటూ స్టెప్పులేస్తుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus