Jr NTR: ఆ రెండు సినిమాలు హిట్టైతే తారక్ ఖాతాలో ట్రిపుల్ హ్యాట్రిక్ రికార్డ్ చేరుతుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి దేవర సినిమా వరకు వరుస విజయాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసే బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. వరుసగా ఏడు విజయాలను అందుకున్న తారక్ వార్2, ప్రశాంత్ నీల్ సినిమాలతో హిట్లు సొంతం చేసుకుంటే తారక్ ఖాతాలో ట్రిపుల్ హ్యాట్రిక్ చేరుతుందని చెప్పవచ్చు. తారక్ కథల ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలే సక్సెస్ రేట్ ను పెంచుతున్నాయి.

Jr NTR

ఎంతోమంది ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చిన తారక్ ఆయా డైరెక్టర్ల కెరీర్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్లస్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కానున్నారు. ఏడాదికి ఒక సినిమాలో నటించే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ ఉన్నాయి. పాన్ ఇండియాలో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు.

భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్న తారక్ తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ పాత్రకు అనుగుణంగా మేకోవర్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. తారక్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకోవడం ఆయన కెరీర్ కు ఎంతగానో మేలు చేస్తోంది. తారక్ కెరీర్ పరంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా సెకండ్ వీకెండ్ కలెక్షన్లతో 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల మార్క్ ను క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఓజీ రిజల్ట్ పై థమన్ కామెంట్స్ వైరల్.. నమ్మకం నిజమవుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus