టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్ల సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. యమదొంగ తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ తో కలిసి నటిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తారు. తల్లి చిన్నప్పటి నుంచి తీసుకున్న శ్రద్ధ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తారక్ చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే తన తల్లి ఒక విషయంలో మాత్రం తనను వారించారని తారక్ తాజాగా జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.
నటుడు సౌకర్యవంతంగా ఉండే పాత్రలను చేయాలని అనుకోడని విలక్షణమైన పాత్రలను చేయాలని భావించే నటులలో తాను ఒకడినని ఎన్టీఆర్ అన్నారు. తాను సౌకర్యవంతంగా ఉన్నానని భావించిన సమయంలో జక్కన్న బయటకు తీసుకొస్తాడని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. రాజమౌళి గొప్ప డైరెక్టర్ మాత్రమే కాదని తనకు ఆప్తుడని ఎన్టీఆర్ తెలిపారు. అజయ్ దేవగణ్ పూల్ ఔర్ కాంటే సినిమా చూస్తున్న సమయంలో ఆ సినిమాలో రెండు బైక్స్ పై చేసిన యాక్షన్ సీన్ చూసి స్టన్ అయిపోయానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
తాను కూడా అలా బైక్స్ పై ప్రయత్నించాలని చెబితే అవన్నీ సినిమాల్లోనే కుదురుతాయని అమ్మ హెచ్చరించారని ఎన్టీఆర్ పేర్కొన్నారు. తాను గురువులా భావించే అజయ్ దేవగణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ లో నటించడం సంతోషంగా ఉందని ఎన్టీఆర్ వెల్లడించారు. 1920 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన రిలీజ్ కానుంది.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!