Jr NTR Watch Cost: షాక్ ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కొత్త వాచ్ రేట్!

  • December 11, 2021 / 12:50 PM IST

టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో చిత్రయూనిట్ సభ్యులు కూడా చాలా బిజీగా పాల్గొంటున్నారు. భాషతో సంబంధం లేకుండా ఇతర మీడియా సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ముంబై చెన్నై లో కూడా వరుస ప్రమోషన్స్ చేశారు. అయితే తారక్ చేతిలో ఉన్న ఒక గడియారం ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ కు కార్లు అన్న వాచ్ లు ఉన్నా కూడా చాలా ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తారక్ కు నచ్చితే ఎంత ఖరీదైనా సరే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తాడు. ఇక ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన ఒక బ్రాండ్ వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రిచర్డ్ మిల్లే RM కు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ అత్యంత ఖరీదైన వాచ్ అని ప్రత్యేకంగా చెప్పనవరంలేదు లేదు.

ఇక వాటిలో రోజ్ గోల్డ్ లోటస్ F1 టీమ్ లిమిటెడ్ ఎడిషన్ కూడా చాలా కాస్ట్లిగా ఉంటుంది. ఇక వాటి ధర గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. తారక్ ప్రస్తుతం వేసుకున్న ఆ వాచ్ ధర 39,932,395 రూపాయలని తెలుస్తోంది. అంటే దాదాపు రూ.4 కోట్లని చెప్పవచ్చు. ఇలాంటివి తారక్ దగ్గర మరో రెండు వాచ్ లు ఉన్నాయని సమాచారం.

గతంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సంద్భంగా కళ్యాణ్ రామ్ 2కోట్లకు పైగా ధర కలిగిన చేతి గడియారాన్ని కానుకగా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వాచ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటించిన RRR సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus