Lakshmi Pranathi: ఎన్టీఆర్ భార్య పెళ్లి చీర ఖరీదు అంతా.. అభిమానులు షాకయ్యేలా?

  • July 26, 2023 / 02:32 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి జోడీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య భారీ స్థాయిలో ఉంది. 2011 సంవత్సరం మే నెల 5వ తేదీన ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వివాహం జరిగింది. ఈమె ప్రముఖ బిజినెస్ మేన్ నార్నె శ్రీనివాసరావు కూతురు కాగా తారక్ ప్రణతిలకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లతో ఇద్దరు కొడుకులు ఉన్నారు.

పెళ్లి తర్వాత లక్ష్మీ ప్రణతి పూర్తిగా కుటుంబానికే పరిమితమై పిల్లల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. పెళ్లి సమయంలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ధరించిన చీర ఖరీదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం. ఈ చీర ఖరీదు తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది. ఈ చీర ఖరీదు కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi) పెళ్లి అంగరంగ వైభవంగా జరగగా అప్పట్లో ఈ పెళ్లి కోసం దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఖర్చైనట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రణతిల పెళ్లికి 3000 మంది అతిథులు, 12000 మంది అభిమానులు హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన తారక్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో యాక్షన్ కు పెద్ద పీట వేస్తున్నారని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ కాంబో సీన్లు అదుర్స్ అనేలా ఉంటాయని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లు సైతం భారీ రేంజ్ లో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలకు ఎన్టీఆర్ పెద్ద పీట వేస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus