పెద్ద సినిమాలు తీస్తున్న దర్శకులు.. రన్ టైం విషయంలో తర్జనభర్జన పడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే పర్వాలేదు.. కానీ ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే.. ఈ రన్ టైం అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. రిలీజ్ తర్వాత వెంటనే కొంత భాగాన్ని ట్రిమ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. తద్వారా ఎక్కువ డ్యామేజ్ జరగదు అనేది వారి అభిప్రాయం. కానీ అది కూడా సరైన పద్ధతి కాదు.
అది ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే’ అవుతుంది. ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’.. మొదటిసారి చేస్తున్నప్పుడే ల్యాగ్ అనే భావన కలగకుండా చేస్తే మంచిది. ఇప్పుడు ‘దేవ ర’ (Devara)టీం అదే పనిలో పడినట్లు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘దేవర’ రన్ టైం 2 గంటల 57 నిమిషాలు వచ్చిందట. తర్వాత డైరెక్టర్ కొరటాల (Koratala Siva) , ఎన్టీఆర్ (Jr NTR) , కళ్యాణ్ రామ్ (Kalyan Ram)..లు కూర్చుని దాన్ని ఓ పది నిమిషాల పాటు తగ్గించినట్టు సమాచారం.
అయినప్పటికీ సినిమా ఇంకా ల్యాగ్ అనే ఫీలింగ్ ఇస్తుంది అని ఇటీవల డిస్ట్రిబ్యూటర్లు.. అభిప్రాయపడ్డారట. దీంతో మరికొంచెం ట్రిమ్ చేయాలని.. ‘దేవర’ టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో 8,9 నిమిషాలు ట్రిమ్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. అప్పుడు 2 గంటల 40 నిమిషాల్లోపే రన్ టైం ఉంటుంది కాబట్టి.. పెద్దగా ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. ఇక ‘దేవర’ (Devara) సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి ఓ 4 రోజుల ముందు మరో ట్రైలర్ వదిలే ఛాన్స్ ఉంది.