Devara: రెండు భాగాలుగా దేవర.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే?

పోకిరి సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి ఆ సినిమా క్లైమాక్స్ కారణమని చాలామంది భావిస్తారు. ఎవరూ ఊహించని ఆ ట్విస్ట్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. పూరీ జగన్నాథ్ 2006లోనే పోకిరి లాంటి అద్భుతమైన సినిమాను తెరకెక్కించగా ఈ జనరేషన్ ప్రేక్షకులు తమ ఫేవరెట్ హీరోల ప్రతి సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో దేవర సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని సమాచారం అందుతోంది.

పోకిరి, బాహుబలి1 క్లైమాక్స్ ట్విస్ట్ లను చూసి ప్రేక్షకులు ఏ విధంగా ఫీలవుతారో (Devara) ఈ సినిమాను చూసి కూడా అదే విధంగా ఫీలయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుందని తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ వార్త గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ సినిమాను మొదలుపెట్టనున్నారు. వచ్చే ఏడాది మార్చి నెల నుంచి తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం.

తారక్ కు వీరాభిమాని అయిన ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కు సూట్ అయ్యే కథతోనే ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో తారక్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్లు నటిస్తుండటం గమనార్హం.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus