Jr NTR: కొరటాల సినిమా మీద ఎఫెక్ట్‌ పడుతుందా?

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’షో… ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’గా మారిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా ఈ షోను ప్రారంభిస్తున్నట్లు ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పారు కూడా. రిజిస్ట్రేషన్ల కోసం ప్రశ్నలు కూడా ఇచ్చారు. దీంతో త్వరలో షో అనుకుంటుండగా కరోనా సెకండ్‌ వేవ్‌ రావడంతో షోను మొదలుపెట్టడం కుదర్లేదు. కాస్త కుదుటపడ్డాక మొదలుపెడతారేమో అని అందరూ అనుకుంటుడగా ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డాడు. మరోవైపు షో చిత్రీకరణ ఎప్పుడు అనేది కూడా తెలియడం లేదు. దీంతో షో ఉంటుందా? లేదా ? అనే ప్రశ్నలు వస్తున్నాయ్‌.

ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే. ఈ షో ఆగిపోవడం అనేది అసాధ్యం. కేవలం వాయిదా మాత్రమే పడుతుంది. ఎందుకంటే షో కోసం అగ్రిమెంట్లు, డేట్స్‌ అంటూ పెద్ద తతంగమే ఉంటుంది. ఏదో టీవీ ఇంటర్వ్యూలా వద్దనుకుంటే ఆగిపోదు. సో ఎప్పుడు పరిస్థితి మారితే అప్పుడు మొదలుపెడతారు. అక్కడికి కొద్ది రోజులకు టీవీలో ప్రసారమవుతుంది. కాబట్టి ఇప్పటికి షో వాయిదా మాత్రమే. అయితే ఇక్కడ ఉన్న అసలు సమస్య. ఎన్టీఆర్‌ సినిమాల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఎన్టీఆర్‌ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చివరిదశకొచ్చింది. మరోవైపు కొరటాల సినిమా మొదలుపెట్టాలి. ఇప్పుడు షో ఆలస్యం కావడంతో డేట్స్‌ అడ్జస్ట్‌మెంట్‌లో ఇబ్బంది వస్తుంది. షోకి డేట్స్‌ ఇవ్వాలంటే సినిమా వాయిదా పడక తప్పదు. కొరటాల సినిమా, షో పారలల్‌గా చేయాలి అంటే… ఎన్టీఆర్‌ డబుల్‌ షిప్ట్‌ చేయాలేమో మరి.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus