ఓటరు జాబితాలో ఉన్న బోగస్ ఓటర్లను తొలగించిన తరువాతే ‘మా’ ఎలెక్షన్స్ నిర్వహించాలని జూనియర్ ఆర్టిస్ట్ సంఘం నేతలు డిమాండ్ చేశారు. అక్టోబర్ 10న(ఆదివారం) జరిగే ఎన్నికల్లో 3,609 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు ఓటు హక్కు కలిగి ఉన్నారని.. అయితే ఓటరు జాబితాలోని పేరున్న వారికి ఫోన్లు చేస్తే చాలా మంది తాము యూనియన్ సభ్యులం కాదని చెబుతున్నారని.. మరికొందరు సమాధానం చెప్పడం లేదని జూనియర్ ఆర్టిస్ట్ సంఘం నేతలు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బైలాస్‌కు విరుద్ధంగా పని చేస్తున్న వల్లభనేని అనిల్ కుమార్, స్వామి గౌడ్, సినీ పరిశ్రమకు సంబంధం లేని శేషగిరిరావాలు నామినేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓటరు లిస్ట్ ను సరి చేసి అప్పుడు ఎన్నికలు నిర్వహించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత సెప్టెంబర్ నెలలో జూనియర్ ఆర్టిస్ట్ మీటింగ్ జరిగినప్పుడు కూడా అక్టోబర్ 10న ఎన్నికలు జరుపుతున్నట్లు ప్రకటించలేదని.. ఎజెండా లేకుండా కేవలం నాలుగు రోజుల ముందు నోటీస్ బోర్డుపై వివరాలు ఉంచారని దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
యూనియన్ లో రికార్డులు అడిగినా.. ఇవ్వడం లేదని, ఎందుకలా చేస్తున్నారంటూ ప్రశ్నించారు. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి 1,600 కార్డులలో 720 కార్డుల సభ్యుల నుంచి ఒక్కొక్కరికి రూ. 25 వేలు కార్డు రెన్యువల్ పేరుతో సుమారు రూ.1.80 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. అసలు బైలాస్‌కు విరుద్ధంగా ఎలా వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓటరు జాబితా, బ్యాంక్ అకౌంట్, ఆడిటింగ్ డీటైల్స్ అన్నీ చెక్ చేసుకునే అవకాశం జూనియర్ ఆర్టిస్ట్ లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు