ప్రముఖ బిజినెస్మెన్, మంత్రి అయినటువంటి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటీ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తూ ‘జూనియర్’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో సీనియర్ స్టార్ హీరోయిన్ జెనీలియా ముఖ్య పాత్ర చేసింది. ఈ సినిమా ఆమెకు రీ ఎంట్రీ మూవీ అని చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన ‘వైరల్ వయ్యారి’ పాట బాగా వైరల్ అయ్యింది. సినిమాపై అందరి ఫోకస్ పడేలా చేసింది. రాధాకృష్ణ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. జూలై 18న రిలీజ్ అయ్యింది ఈ సినిమా.
మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ మాస్ సెంటర్స్ లో ఈ సినిమా బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.86 cr |
సీడెడ్ | 0.18 cr |
ఆంధ్ర | 1.10 cr |
ఏపీ+తెలంగాణ | 2.14 cr |
కర్ణాటక | 0.82 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.42 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 3.38 cr |
‘జూనియర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.8.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ ముగిసేసరికి రూ.3.38 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.12 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.