తేజ సజ్జ హీరోగా ‘మిరాయ్’ తెరకెక్కుతుంది. ఏప్రిల్ 18నే ఈ సినిమా రావాలి. కానీ షూటింగ్ అనుకున్న టైంకి కంప్లీట్ కాకపోవడంతో ఆగస్టు 1కి వాయిదా వేశారు. తర్వాత ఆ డేట్ కూడా కష్టమని భావించి సెప్టెంబర్ 5కి వెళ్ళారు. ఇప్పుడు ఆ డేట్ కూడా కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా సీజీ వర్క్ చాలా పెండింగ్ ఉందట. గ్రాఫిక్స్ వాడకం ఎక్కువగా ఉండటం వల్ల టైం పడుతుందని తెలుస్తుంది.
Mirai
‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు. ‘మిరాయ్’ గ్లింప్స్, టీజర్ బయటకు వచ్చాయి. రెండూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటించడం మరో విశేషంగా చెప్పుకోవాలి.
ఇదిలా ఉండగా.. ‘మిరాయ్’ సినిమా సెప్టెంబర్ 5కి వస్తుందా? రాదా? అనేది ప్రస్తుతానికైతే డౌట్. కానీ టీజర్ మాత్రం ఈ సినిమాకి కొంత బజ్ తీసుకొచ్చింది. ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ నుండి వస్తున్న సినిమా.. పైగా పురాణాల టచ్ ఉంది. అందువల్ల నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ బాగా జరిగిందని అంటున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం. ‘మిరాయ్’ డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ను జియో హాట్ స్టార్ సంస్థ ఏకంగా రూ.55 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందట. సినిమాకు రూ.130 కోట్ల బడ్జెట్ అవుతున్నట్టు వినికిడి. ఇంకా డబ్బింగ్, ఆడియో, థియేట్రికల్ రైట్స్ చేతిలో ఉన్నాయి. సో అటు ఇటులో ఈ సినిమా రిలీజ్ కి ముందే సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.