గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటీ రెడ్డి ‘జూనియర్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ‘వారాహి చలన చిత్ర’ బ్యానర్ పై సాయి కొర్రపాటి.గత వారం అంటే జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. శ్రీలీల హీరోయిన్ గ్లామర్, సీనియర్ హీరోయిన్ జెనీలియా నటన ఆకట్టుకుంది.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు పర్వాలేదు అనిపించాయి. ‘వైరల్ వయ్యారి’ పాట అయితే ఓ ఊపు ఊపింది. ఆ పాట కోసమే టికెట్లు బాగా తెగాయి అనడంలో సందేహం లేదు. దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి కథనంపై మరింత కేర్ తీసుకుని ఉంటే కచ్చితంగా ఈ సినిమా మరింతగా కలెక్ట్ చేసి ఉండేది.ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.05 cr |
సీడెడ్ | 0.26 cr |
ఆంధ్ర | 1.35 cr |
ఏపీ+తెలంగాణ | 2.66 cr |
కర్ణాటక | 1.12 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.57 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.35 cr |
‘జూనియర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.8.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.4.35 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.3.65 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో ఈ సినిమా కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. కొత్త సినిమా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అయ్యింది కాబట్టి.. ఇక జూనియర్ కి ఎక్కువ క్యాష్ చేసుకునే అవకాశాలు ఉండవు అనే చెప్పాలి.