జూనియర్ ఎన్టీఆర్ మామగారైన నార్నె శ్రీనివాసరావు తాజాగా వైసీపీ పార్టీలో చేరారు. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణితో, నార్నె శ్రీనివాస్ రావు తో పాటు పలువురు వై.సి.పి నేత వైఎస్ జగన్ సమక్షంలో వారు వైసీపీలో పార్టీ చేరారు. ఈ క్రమంలో జూ.ఎన్టీఆర్ మామగారైన నార్నె శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ “గత పదేళ్ళ నుండీ వైసీపీతో నాకు మంచి అనుబంధం ఉంది. వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని కోసం నా వంతు కృషి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నేనేదో టికెట్ ఆశించి మాత్రమే పార్టీలో చేరలేదు అంటూ చెప్పుకొచ్చాడు.
నార్నె శ్రీనివాస్ ఇలా వైసీపీ పార్టీలో చేరారో లేదో… తన అల్లుడు జూ.ఎన్టీఆర్ కూడా వై.ఎస్. జగన్ కి మద్దతు తెలుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం పై కూడా నార్నెక్లారిటీ ఇచ్చాడు. ” నేను వైసీపీలో చేరడానికి.. నా అల్లుడు జూ.ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం” అంటూ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఇది ఎన్టీఆర్ కి షాకిచ్చే న్యూస్ అనడంలో సందేహం లేదు. అసలే ఎన్టీఆర్ కి … బాలయ్య, చంద్రబాబు కి చాలా గ్యాప్ వచ్చింది. హరికృష్ణ మరణం తరువాత ఇప్పుడిప్పుడే.. మళ్ళీ వారికి దగ్గరవుతున్నాడు ఎన్టీఆర్. అసలు ముందు ఎన్టీఆర్ బాలయ్యకు, చంద్రబాబు లకి దూరమయ్యింది కూడా రాజకీయ వ్యవహారాల వల్లే అని అందరికీ తెలుసు. గతంలో జూ.ఎన్టీఆర్ సన్నిహితుడు కోడలి నాని..టి.డి.పి నుండీ వై.సి.పి లో చేరడం ఎన్టీఆర్ కి పెద్ద సమస్యని తెచ్చిపెట్టింది. ఇప్పుడు మళ్ళీ తన మామ కూడా ఇదే పని చేసాడు. ఇప్పుడు ఎన్టీఆర్ పరిస్థితి ఎలా ఉండబోతుందో మరి..!