Jyothika, Suriya: సూర్య అలాంటి హస్బెండ్ అంటున్న జ్యోతిక!

స్టార్ హీరో సూర్య, జ్యోతిక జోడీకి చాలామంది అభిమానులు ఉన్నారు. సూర్య నటించిన జై భీమ్ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మధ్య కాలంలో సూర్య నటించిన సినిమాలు వరుసగా సక్సెస్ సాధిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే తాజాగా జ్యోతిక సూర్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.

హోమ్ బ్యానర్ అయిన 2డీ ఎంటర్టైన్మెంట్ యొక్క బాధ్యతలను కూడా జ్యోతిక చూసుకుంటున్నారు. సూర్య జ్యోతిక ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎన్నో జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా జ్యోతిక తమ బ్యానర్ లో ఏకంగా 15 సినిమాలు తెరకెక్కుతున్నాయని వెల్లడించారు. సూర్యకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి సహజంగానే తనకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని జ్యోతిక నవ్వుతూ చెప్పుకొచ్చారు. సూర్య రొమాంటిక్ హస్బెండ్ అని నన్ను, పిల్లలను బాగా చూసుకుంటాడని ఆమె వెల్లడించారు.

సూర్య ప్రొడక్షన్ హౌస్ విషయంలో తన భాగస్వామ్యంను ప్రోత్సహిస్తాడని తనకు నచ్చిన సినిమాలను ఎంకరేజ్ చేస్తారని జ్యోతిక పేర్కొన్నారు. కథలో కొత్తదనం ఉన్న సినిమాలను మాత్రమే తన బ్యానర్ లో నిర్మిస్తున్నామని జ్యోతిక తెలిపారు. తాను ఇటీవల నటించిన ఉడన్పిరప్పే మూవీ కూడా ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగానే తెరకెక్కిందని జ్యోతిక చెప్పుకొచ్చారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus