టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన జ్యోతిక ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారనే సంగతి తెలిసిందే. చంద్రముఖి సినిమాలో ఆమె అద్భుతమైన నటనకు ఫిదా కాని ఫ్యాన్స్ దాదాపుగా ఉంటారు. జ్యోతిక సినీ కెరీర్ లో ఆమె ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. పెళ్లై పిల్లలున్నా పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ జ్యోతిక సత్తా చాటుతున్నారు. సోషల్ మీడియాలో సైతం జ్యోతిక యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.
ఇన్ స్టాగ్రామ్ లో జ్యోతికకు ఏకంగా 2.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. జ్యోతిక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో మాత్రం కేవలం 13 మందిని మాత్రమే ఫాలో అవుతుండటం గమనార్హం. తాజాగా జ్యోతిక వర్కౌట్లకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ప్రస్తుతం జ్యోతిక వయస్సు 44 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. ఈ వయస్సులో కూడా కఠినమైన వ్యాయామాలు చేస్తూ జ్యోతిక అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆమె చేస్తున్న వర్కౌట్లు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. జ్యోతికను సూపర్ మామ్ అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. వయస్సు పెరుగుతున్నా వర్కౌట్ల విషయంలో జ్యోతిక తగ్గడం లేదని ఆమె గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒళ్లు జలదరించేలా ఉన్న ఆ వర్కౌట్లు చేయాలంటే ఎంతో కృషి ఉండాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జ్యోతిక తెలుగులో రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జ్యోతికను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. జ్యోతిక చేసిన పోస్ట్ కు 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. జ్యోతిక కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జ్యోతికకు అన్ని విషయాలలో సూర్య నుంచి కూడా భారీ స్థాయిలో సపోర్ట్ లభిస్తోందని సమాచారం అందుతోంది.