దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు వందకి పైగా సినిమాలు తీసారు. సినీ రంగంలో యాభై ఏళ్ల అనుభవం ఉంది. ఆ ఎక్స్ పీరియన్స్, ఆయన నేర్చుకున్న విషయాలను కేఆర్ఆర్ క్లాస్ రూమ్ ద్వారా చెప్పడం ప్రారంభించారు. సినీ దర్శకుడు కావడానికి ఇదొక్కటే మార్గం కాదు .. ఇది ఒక మార్గం మాత్రమే అంటూ తన లెసన్ వన్ ను యూ ట్యూబ్ లో శుక్రవారం విడుదల చేసారు. డైరక్టర్ గా ఎదగాలని కలలు కనే ఉత్సాహవంతులు ఈ వీడియో ను ఎక్కువగా చూసారు. ఇందులో రెండు విషయాల గురించి దర్శకేంద్రుడు వివరించారు.
1. దర్శకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి ?
ఎలాగైనా డైరక్టర్ కావాలనే పట్టుదల ఉండాలి. ఒక సీన్ ను క్రియేటివ్ గా తీయగల నేర్పు ఉండాలి.
అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేసేటప్పుడే కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. రచయిత కథను చెబుతుంటే ఒక వైపు వింటూ దృశ్యం ఊహించుకోగలగాలి. మైండ్ లోనే ఒక స్టోరీ బోర్డ్ వేసుకోవాలి. ఏ షాట్ ఎందుకు తీస్తున్నారో సీరియస్ గా అబ్జర్వ్ చేయాలి. ఆ సీన్ ని నేనైతే ఎలా తీస్తానో ఊహించుకోవాలి. అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నప్పుడు సెట్ లో చలాకిగా ఉండాలి. టెక్నిషియన్లతో పరిచయం పెంచుకోవాలి. నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండాలి.
రెండో విషయం తాను (కె. రాఘవేంద్ర రావు) డైరక్టర్ గా ఎలా అయ్యారో వెల్లడించారు.
11 నిముషాల నిడివి ఉన్న ఈ వీడియోను ఒక్క రోజులో 6000 మందికి పైగా చూసారు. కె. రాఘవేంద్ర రావు శిష్యుడు, అపజయం ఎరుగని డైరక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కూడా ఈ క్లాస్ ని చూసారు. “నేను అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నప్పుడు సిగ్గుతో ఉండేవాన్ని. మెల్లగా షై పోగొట్టుకున్నారు. షాట్స్ తీస్తున్నప్పుడు పరిశీలించడం నేర్చున్నాను. కె. రాఘవేంద్ర రావు తొలి వీడియోలో చెప్పిన విషయాలను అసిస్టెంట్ డైరక్టర్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. వారికి కేఆర్ఆర్ క్లాస్ రూమ్ ఎంతో ఉపయోగ పడుతుంది” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.