కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ‘K-Ramp‘. ఇటీవల అంటే దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదలైన సంగతి తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ జెయిన్స్ నాని తెరకెక్కించిన ఈ సినిమాని ‘హాస్య మూవీస్’ పై రాజేష్ దండా నిర్మించారు. ‘రంగబలి’ ఫేమ్ యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్స్ వంటివి పెద్దగా ఇంప్రెస్ చేయలేదు కానీ..
మొదటి రోజు సినిమాకి పర్వాలేదు అనిపించే రిపోర్ట్స్ రావడం పోటీగా రిలీజ్ అయిన సినిమాలు కూడా నిరాశపరచడంతో ‘K-Ramp’ కి కలిసొచ్చినట్టు అయ్యింది. దీంతో దీపావళి విన్నర్ గా నిలిచింది ‘K-Ramp’. 5 రోజులకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. రెండో వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకుంది. కానీ తర్వాత భారీ వర్షాల ప్రభావం వల్ల డౌన్ అయ్యింది. ఆంధ్రాలో చాలా థియేటర్లు మూతపడడంతో కొంత దెబ్బ పడింది.
ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 3.31 cr | 
| సీడెడ్ | 1.34 cr | 
| ఆంధ్ర(టోటల్) | 3.56 cr | 
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 8.21 cr | 
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.90 cr | 
| ఓవర్సీస్ | 1.04 cr | 
| టోటల్ వరల్డ్ వైడ్ | 10.15 కోట్లు(షేర్) | 
‘K-Ramp‘ సినిమాకు రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 13 రోజుల్లో రూ.10.15 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.17.90 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.2.65 కోట్లు ప్రాఫిట్స్ అందుకుంది. కాకపోతే ఈరోజు నుండి ‘బాహుబలి – ది ఎపిక్’ ‘మాస్ జాతర’ వంటి కొత్త సినిమాలు వస్తున్నాయి.. కాబట్టి థియేటర్స్ చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది.