‘K-RAMP’ Twitter Review: K ర్యాంప్ మూవీ ట్వీట్టర్ రివ్యూ!

కిరణ్ అబ్బవరం హీరోగా `K-RAMP` అనే సినిమా రూపొందింది. జెయిన్స్ నాని ద‌ర్శ‌కుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాని రాజేష్ దండా నిర్మించారు. యుక్తి తరేజా హీరోయిన్.అక్టోబర్ 18న అంటే ఈరోజు విడుదల కానుంది ఈ సినిమా. ప్రమోషన్స్ చాలా గట్టిగా చేశారు. ‘A’ రేటింగ్ ఇచ్చినప్పటికీ ఇది ‘ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా’ అంటూ ప్రమోషన్స్ లో టీం గట్టిగా చెప్పుకొచ్చారు. టీజ‌ర్.. ట్రైల‌ర్స్ వంటివి టార్గెటెడ్ ఆడియన్స్ ని మెప్పించాయి.

`K-RAMP` X Review

ముఖ్యంగా లిప్ లాక్..లు వంటి యూత్ ని ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. ఇదిలా ఉండగా… ఆల్రెడీ ఓవర్సీస్ లో `K-RAMP`షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఓ వ్యక్తి `K-RAMP`చూసి ట్విట్టర్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు. ” `K-RAMP` అనేది ఒక సిల్లీ, ఔట్ డేటెడ్ సినిమా అని.. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అలానే ఉంటుందని చెప్పుకొచ్చాడు. సినిమా సింపుల్ కథతో మొదలై తర్వాత రొటీన్ స్క్రీన్ ప్లే తో సాగుతుందని, ఇలాంటి కథలు గతంలో మనం చాలా చూశామని, కామెడీ ఉంటే చాలు అనుకునేవాళ్ళకి ఇది పర్వాలేదు అనిపిస్తుందని, మిగతా వాళ్లకి మాత్రం ఇది సిల్లీగా క్రింజ్ లా అనిపిస్తుందని అతను రాసుకొచ్చాడు.

దర్శకుడు నాని కొన్ని కామెడీ సీన్స్ బాగా రాసుకున్నాడట. హీరో కిరణ్ అబ్బవరం ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని కూడా అతను పేర్కొన్నాడు. ఫైనల్ గా అతను 2/5 రేటింగ్ ఇచ్చాడు.మరి వ్యక్తి అయితే బాగానే రాసుకొచ్చి 2.5/5 ఇచ్చాడు.మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి

3 ఔట్.. ఇప్పుడు అందరి చూపు కిరణ్ పైనే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus