వరుస ప్లాపుల తర్వాత హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘క’ (KA) తో మంచి సక్సెస్ అందుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుంది. సుజీత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ అయ్యి 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది. వీకెండ్ అద్భుతంగా క్యాష్ చేసుకున్న ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. మిగిలిన సినిమాలతో పోలిస్తే ‘క’ తక్కువ థియేటర్లలోనే రిలీజ్ అయ్యింది.
అయినా సరే మౌత్ టాక్ తో స్ట్రాంగ్ గా నిలబడింది. వీకెండ్ కి థియేటర్స్ పెరగడం కూడా అడ్వాంటేజ్ అయ్యింది అని చెప్పాలి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 3.88 cr |
సీడెడ్ | 1.78 cr |
ఉత్తరాంధ్ర | 1.96 cr |
ఈస్ట్ | 0.43 cr |
వెస్ట్ | 0.32 cr |
గుంటూరు | 0.47 cr |
కృష్ణా | 0.63 cr |
నెల్లూరు | 0.24 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 9.71 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.56 cr |
ఓవర్సీస్ | 2.33 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 12.60 cr |
‘క’ చిత్రానికి రూ.4.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 6 రోజులు పూర్తయ్యేసరికి రూ.12.6 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ చిత్రం రూ.8.1 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది ఈ చిత్రం.