KA Collections: ‘క’ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది..లాభం ఎంత?

హీరో కిరణ్ అబ్బవరం  (Kiran Abbavaram) తన లేటెస్ట్ మూవీ ‘క’  (KA) తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్ బాగా వర్కౌట్ అయ్యింది. 3 సినిమాలతో పోటీలో తక్కువ థియేటర్లు వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేసింది. సుజీత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు రెండో వారంలోకి అడుగుపెట్టింది.చెన్నై వంటి సిటీల్లో రెండో వారం రిలీజ్ అవుతుంది.

KA Collections:

అక్కడి థియేటర్స్ లో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక ‘క’ 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.23 cr
సీడెడ్ 1.96 cr
ఉత్తరాంధ్ర 2.09 cr
ఈస్ట్ 0.49 cr
వెస్ట్ 0.36 cr
గుంటూరు 0.52 cr
కృష్ణా 0.71 cr
నెల్లూరు 0.27 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 10.63 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.62 cr
ఓవర్సీస్ 2.52 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 13.77 cr

‘క’ చిత్రానికి రూ.4.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.13.77 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ చిత్రం రూ.9.27 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

‘అమరన్’.. 8 రోజుల కలెక్షన్స్..లాభం ఎంత?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus