కైకాల సత్యనారాయణ అంటే అదిరిపోయే క్యారెక్టర్లు అనుకుంటూ ఉంటారు. ఆ రోజుల్లో కైకాల ఓ సినిమాలో ఉన్నారు అంటే.. సూపర్బ్ క్యారెక్టర్ పక్కా అని ఫిక్స్ అయిపోయేవారు. అంతలా ఆయన కోసం పాత్రలు రాసేవారు రచయితలు, దర్శకులు. అయితే కైకాలో కేవలం నటుడు మాత్రమే కాదు. ఓ మంచి ప్లేయర్ కూడా ఉన్నారట. వెండితెరకు హీరోగా పరిచయమైన కైకాల తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా రకాల పాత్రలు పోషించారు.
అంతకు ముందు నాటకాల్లోనూ హీరోగా, విలన్‌గా నటించారు. దానికంటే ముందు స్పోర్ట్స్ ప్లేయర్ కూడా నట. కైకాల చదువుకునే రోజుల గురించి చూస్తే.. కాలేజీలో ఉన్నప్పుడు ఆయన వాలీబాల్, క్రికెట్ బాగా ఆడేవారట. అంతేకాదు స్పోర్ట్స్ అథారిటీ మేనేజర్‌గా కూడా పని చేశారట. ఇక కైకాల రీసెంట్ కెరీర్ చూస్తే.. కైకాల నటించిన చివరి సినిమా మహేష్‌బాబు ‘మహర్షి’. అందులో పూజా హెగ్డేకు తాత పాత్రలో కనిపించారు. దానికంటే ముందు అంటే ఎన్టీఆర్ జీవిత కథ ‘యన్.టి.ఆర్ – కథానాయకుడు’లో ప్రముఖ దర్శకుడు హెచ్.ఎం. రెడ్డిగా కనిపించారు.
నటుడిగా ఆయన పూర్తిస్థాయిలో కనిపించిన చివరి సినిమా అంటే ‘అరుంధతి’ అనే చెప్పాలి. కైకాల తన కెరీర్ నాగయ్య తరం నుంచి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏయన్నార్ సినిమాల్లో నటించారు. వారి తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో యాక్ట్ చేశారు. ఆ తరం తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్ సినిమాల్లోనూ చేశారు. ఇప్పటి తరం కుర్ర హీరోలతోనూ కొన్ని సినిమాలు చేశారు.
అలా మొత్తం ఇండస్ట్రీలో ఐదు తరాల హీరోలతో నటించి మెప్పించారు కైకాల. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్… హిందీలో దిలీప్ కుమార్, అనిల్ కపూర్ వంటి హీరోలతో కైకాల సత్యనారాయణ నటించారు.
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!