కొత్త ఫోటోలతో హీటు పెంచుతున్న కాజల్

కాజల్ గురించి ఎంత చెప్పుకొన్నా ఇంకా చెప్పుకోవాల్సింది చాలా ఉంటుంది. అది ఆమె సినిమాల గురించి కావచ్చు, ఆమె ఎంచుకొనే పాత్రల గురించి కావచ్చు లేదా ఆమె అందచందాల గురించి కావచ్చు. 33 ఏళ్ల ఈ పడుచుపిల్ల ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ కొత్త హీరోయిన్లకు కంటి మీద కునుకు లేకుండా చేయడంలో స్పెషలిస్ట్. అయితే.. ఈమధ్య సదరు ఫోటోషూట్ల మోతాదు కాస్త పెంచింది. అలాగే.. అందాల ఆరబోతను కూడా కాస్త మోడ్రన్ గా చేస్తోంది. అందుకే.. కాజల్ కొత్త ఫోటోషూట్ లకు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.

ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు, తమిళంలో రెండు సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ తాజాగా ఒక స్పెషల్ ఫోటోషూట్ చేయించుకొంది. అది ఏదైనా స్పెషల్ బ్రాండ్ కోసమా లేక పర్సనలా అనేది తెలియదు కానీ.. ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవ్వడమే కాక అబ్బాయిల మొబైల్ వాల్ పేపర్లుగా మారిపోయాయి. వయసు పెరిగే కొద్దీ అందాలు కూడా పెంపొందించుకుంటున్న కాజల్ ఫిట్ నెస్ పరంగానూ సాటి హీరోయిన్స్ కు గోల్స్ ఇస్తోంది. చూస్తుంటే.. మరో పదేళ్లవరకూ కూడా కాజల్ కి సాటిగా కానీ పోటీగా కానీ నిలిచే అందగాత్తె ఇంకొకరు ఇండస్ట్రీకి రాకపోవచ్చు. అయినా కాజల్ మరీ ఇలా హీటెక్కిస్తుంటే కుర్రాళ్ళు మాత్రం ఏం చేయగలరు చెప్పండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus