వైరల్ అయిన కొండ చిలువతో కాజల్ ఉన్న వీడియో

పదేళ్లకు పైగా పరిశ్రమలో కొనసాగుతున్న బ్యూటీ కాజల్. తన అందం, అభినయంతో నేటి హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ అవకాశాలను అందుకుంటోంది. 14 ఏళ్ళ క్రితం తేజ దర్శకత్వంలో లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు అదే డైరక్టర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌‌ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ థాయ్‌లాండ్‌లోని అటవీ ప్రాంతమైన నఖోమ్‌లో జరుగుతోంది. చిత్ర యూనిట్ మొత్తం ఈ చిత్రీకరణను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా కాజల్ అక్కడి కొండచిలువను పట్టుకొవడమే కాకుండా.. మెడలొ వేసుకొని వీడియో కూడా తీసుకుంది. కొంతమంది అలవాటు ఉన్నవారు మాత్రమే కొండచిలువతో సాహసాలు చేస్తారు. కానీ కాజల్ అలా చేసేసరికి అభిమానులు, నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఆ వీడియోలో దైర్యంగా మాట్లాడుతోంది.

కొండచిలువ స్పర్శను తాను గ్రహించగలుగుతున్నా, కండరాల కదలికలు, బసులు కొడుతున్న విషయం తెలుస్తోందంటూ.. రన్నింగ్ కామెంట్రీ కూడా చెబుతూ ఆకట్టుకుంది. “ఇదొక గొప్ప అనుభూతి” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. తేజ, కాజల్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం నేనే రాజు నేనే మంత్రి సినిమా సూపర్ హిట్ అయింది. అందువల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus