వైరల్ అవుతున్న కాజల్ స్మోకింగ్ పిక్స్.. షాక్ లో ఫ్యాన్స్..!

టాలీవుడ్ కు అడుగుపెట్టి.. 13 ఏళ్ళు పైనే కావస్తున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది కాజల్. ఓ పక్క సీనియర్ హీరోలతో నటిస్తూనే మరోపక్క కుర్ర హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ ఇప్పటికీ బిజీ హీరోయిన్ గా గడుపుతోంది. లక్ష్మీ కళ్యాణం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. చందమామ చిత్రంలో అదిరిపోయే అందాలు ఆరబోసి రాజమౌళి కంట్లో పడింది. అంతే మగధీర చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది అనే చెప్పాలి.

అక్కడి నుండీ ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. తరువాత కూడా ఈమె ఎక్కువగా గ్లామర్ పాత్రలనే చేస్తూ వచ్చినప్పటికీ అదే స్థాయిలో రాణిస్తుంది. అయితే గతేడాది అక్టోబర్ ఎండింగ్ లో తన బాల్య స్నేహితుడు గౌతమ్ కిచ్ల నీ పెళ్లి చేసుకున్న కాజల్.. ఈ మధ్య కాలంలో స్మోకింగ్ కూడా చేస్తున్నట్టు కొన్ని ఫోటోలు బయటకి వచ్చాయి. గత మూడు రోజులుగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఈమె అభిమానులు షాక్ కు గురయ్యారు.

నిజంగా కాజల్ కు స్మోకింగ్ హ్యాబిట్ ఉందా అంటూ అయోమయానికి గురయ్యారు. అయితే కాజల్ నిజంగా స్మోకింగ్ చెయ్యలేదు. లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించిన కాజల్.. దాని కోసం స్మోకింగ్ ఎపిసోడ్స్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుండడం విశేషం.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus