Kajal Son: కాజల్ గౌతమ్ ల కొడుకు పేరు ఏంటో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు కాగా దాదాపుగా 16 సంవత్సరాలుగా కాజల్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. కాజల్ ఒక హీరోయిన్ గా నటించిన ఆచార్య ఈ నెల 29వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. కాజల్ తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం కాజల్ మగబిడ్డకు జన్మనివ్వగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లు, కాజల్ సోదరి నిషా అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

Click Here To Watch NOW

అయితే గౌతమ్ కిచ్లు తమ కొడుకు పేరు నీల్ కిచ్లు అని వెల్లడించారు. కాజల్ గౌతమ్ ల కొడుకు పేరు ఎంతో బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాజల్ గర్భవతి అని గతేడాది వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఈ ఏడాది జనవరిలో కాజల్ ప్రెగ్నెన్సీ గురించి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా బేబీ బంప్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. కాజల్ మగబిడ్డకు జన్మనివ్వడంతో కాజల్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

కొన్ని నెలల తర్వాత కాజల్ మళ్లీ సినిమాలతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. ప్రెగ్నెన్సీ వల్ల కాజల్ అగర్వాల్ నిర్మాతలను రిక్వెస్ట్ చేసి గతేడాది కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నారు. కాజల్ కు గతంలో పోలిస్తే కొంతమేర క్రేజ్ తగ్గడంతో సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా కాజల్ అగర్వాల్ కు సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కాజల్ తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.

కాజల్ కు ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ దక్కుతోందని తెలుస్తోంది. కథలకు, పాత్రలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో కాజల్ అగర్వాల్ కెరీర్ లో హిట్లు ఎక్కువగా ఉన్నాయి. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో దాదాపుగా అందరు హీరోలకు కాజల్ అగర్వాల్ జోడీగా నటించారు. బాలయ్య, వెంకటేష్, నాగార్జునలకు జోడీగా కాజల్ ఎప్పుడు నటిస్తారో చూడాల్సి ఉంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus