నా ఎదుగుదల చూసి ఏడ్చే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.!

సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల మధ్య కంటే ఎక్కువ హీరోయిన్ల నడుమ ఇగోల గోల ఎక్కువగా ఉంటుంది. తన అవకాశం తన్నుకుపోయిందనే, తనతో స్నేహంగా మెలుగుతున్న హీరోని తన వలలో వేసుకొందని లేదా వేరే వేరే కారణాల వలన ఎప్పుడూ కోల్డ్ వార్ చేసుకొనే హీరోయిన్లు పైకి మాత్రం ఎప్పుడైనా ఈవెంట్స్, పార్టీస్ లో కలిసినప్పుడు మాత్రం సొంత తోబుట్టువులకంటే ఎక్కువగా రాసుకుపూసుకు తిరుగుతుంటారు.

అయితే.. కొద్ది గంటల క్రితం తన తాజా చిత్రం “ఎమ్మెల్యే” ప్రమోషన్స్ లో భాగంగా తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా ఫేస్ బుక్ ఆఫీస్ కి లైవ్ ఇంటరాక్షన్ కోసం వచ్చిన కాజల్ అగర్వాల్.. లైవ్ సమయంలో అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి చాలా నిజాయితీగా ఆన్సర్ చెప్పింది. “ఇండస్ట్రీలో మీ ఎదుగుదల చూసి ఓర్వలేని హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారా?” అని అడిగిన ప్రశ్నకు మరో ఆలోచన లేకుండా “అవును” అని సమాధానమిచ్చిన కాజల్, పేర్లు అడిగితే మాత్రం “చెప్పనుగా” అంటూ దాటవేసింది. 10 ఏళ్ల కెరీర్ లో కాజల్ స్నేహితులకంటే శత్రువులనే ఎక్కువగా చూసింది. అందుకే ఈ విధంగా ఆన్సర్ చేసి ఉంటుంది. ఇక ఈ లైవ్ చూసిన కాజల్ ను చూసి ఈర్ష్య పడే హీరోయిన్లు ఒక్కసారిగా షాకై, తమ పేర్లు చెప్పనందుకు సంతోషించేవారేమో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus