కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణించింది. ‘లక్ష్మీ కళ్యాణం’తో తెలుగు తెరకు పరిచయమైన కాజల్, ‘చందమామ’, ‘మగధీర’ (Magadheera) లాంటి సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో అగ్ర హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్లింది. ‘మగధీర’లో మిత్రవింద పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాజల్ కెరీర్ ఆ సమయంలో ఎప్పుడూ ఖాళీగా ఉండేది కాదు, ఆమె క్రేజ్ ఆ రేంజ్‌లో ఉండేది.
అయితే, 2020లో పెళ్లి, 2022లో తల్లి కావడంతో కాజల్ కెరీర్‌లో కాస్త స్లోడౌన్ అయింది. పెళ్లి తర్వాత ఆమె నటించిన సినిమాలు ఆశించిన విజయం సాధించలేకపోయాయి. 2023లో ‘భగవంత్ కేసరి’(Bhagavanth Kesari)తో బాలయ్య (Nandamuri Balakrishna) సరసన నటించినప్పటికీ, ఆ సినిమా హిట్ అయినా కాజల్‌కు పెద్దగా క్రెడిట్ దక్కలేదు. ‘సత్యభామ’ (Satyabhama) సినిమాతో వైవిధ్యమైన పాత్ర చేసి సక్సెస్ సాధించాలని ప్రయత్నించినప్పటికీ, ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ప్రస్తుతం కాజల్‌కు తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో అవకాశాలు తగ్గాయి.
ముందు వరకు ఆమె కెరీర్ ఎప్పుడూ బిజీగా ఉండేది, కానీ ఇప్పుడు మంచి అవకాశాలు రావడం లేదని టాక్. సక్సెస్ కోసం కాజల్ విభిన్న కథలు ఎంచుకుంటూ, కొత్త ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఆమె ఎదురుచూసే రేంజ్‌లో ఆఫర్స్ రావడం లేదు. ఈ పరిస్థితి కాజల్ ఫ్యాన్స్‌ను కలవరపరుస్తోంది. కాజల్ తన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌పైకి తీసుకొచ్చేందుకు కొత్త కథలు, వైవిధ్యమైన పాత్రలపై దృష్టి సారించాలని నిర్ణయించుకుంది. ఆమె ఇప్పటికీ సినిమాలు చేయడానికి ఉత్సాహంగా ఉన్నప్పటికీ, సరైన కథలు, అవకాశాలు దొరకడం లేదని సమాచారం.
యువ దర్శకులు కాజల్ లాంటి అనుభవజ్ఞురాలైన నటిని తమ సినిమాల్లోకి తీసుకుని, ఆమె స్టార్‌డమ్‌ను సరైన విధంగా వాడుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. కాజల్ అగర్వాల్ తన సక్సెస్ గ్రాఫ్‌ను మళ్లీ పెంచుకోవడానికి సపోర్టింగ్ రోల్స్ తో రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉందని టాక్. మంచి కథతో ఒక్క హిట్ దక్కితే ఆమె మళ్లీ ఫామ్‌లోకి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. స్టార్ హీరోయిన్‌గా ఒకప్పుడు అలరించిన కాజల్, ఈ కొత్త ప్రయత్నాలతో మళ్లీ తన స్థానాన్ని సంపాదించుకుంటుందా, లేదా అనేది చూడాలి.