భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!
- May 7, 2025 / 03:56 PM ISTByPhani Kumar
‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ (SR Kalyanamandapam) ‘సమ్మతమే’ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) ‘క’ (KA) వంటి హిట్ సినిమాలతో క్రేజీ హీరోగా మారాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇప్పుడు అతని సినిమా అంటే ట్రేడ్లో మినిమమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా కిరణ్ అబ్బవరం సినిమా అంటే ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల కిరణ్ నుండి ‘దిల్ రూబా'(Dilruba) అనే సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అది పెద్దగా నిలబడలేదు. ప్రస్తుతం అతను ‘K – RAMP’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
Kiran Abbavaram ,Rahasya Gorak

అలాగే ‘క’ కి సీక్వెల్ కూడా రూపొందనుంది. అలాగే ఇంకో 2,3 కథలు కూడా లాక్ చేసుకున్నాడు. ఇదిలా ఉండగా… కిరణ్ అబ్బవరం తన ఫస్ట్ మూవీ హీరోయిన్ రహస్య గోరఖ్ ను (Rahasya Gorak) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2024 ఆగస్టు 22న రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. కర్ణాటకలోని కూర్గ్ లో కిరణ్ అబ్బవరం, రహస్య..ల పెళ్ళి కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ కూడా నిర్వహించారు.

ఇక ఇటీవల రహస్య ప్రెగ్నెంట్ అయినట్టు ప్రకటించింది కిరణ్ అబ్బవరం అండ్ టీం. దీంతో నెటిజన్లు పెద్ద ఎత్తున తమ బెస్ట్ విషెస్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రహస్యకి నెలలు నిండాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆమెకు సీమంతం చేశారు. ఈ సందర్భంగా బేబీ బంప్ తో ఆమె ఓ స్పెషల్ ఫోటో షూట్లో పాల్గొంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.













