Kajal Remuneration: ‘బిగ్ బాస్5’ : భారీ పారితోషికం అందుకున్న ఆర్.జె.కాజల్..!

‘బిగ్ బాస్5’ లో 17వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది రహిమునిస్సా మెహ్ సబీనా అదే మన ఆర్.జె.కాజల్…! ‘బిగ్ బాస్’ హౌస్ లో అడుగుపెట్టడం అనేది తన డ్రీం అంటూ చెప్పుకొచ్చిన ఈ విజయవాడ అమ్మాయి… నిజానికి ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతుందని అంతా అంచనా వేశారు.అయితే ఏకంగా ఆమె 14వ వారం వరకు హౌస్ లో కొనసాగింది. మొదట్లో అందరితో ఇంటరాక్ట్ అయిన కాజల్ అక్కడి విషయాలు ఇక్కడ,

ఇక్కడి విషయాలు అక్కడ చేరవేస్తూ ఓ లేడీ నారదలా వ్యవహరించిందని హౌస్ లో ఉన్నవాళ్ళతో పాటు ప్రేక్షకులు కూడా విమర్శల వర్షం కురిపించారు. అయితే సన్నీ, మానస్‌ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ లతో ఆమె ఫ్రెండ్ షిప్ చేయడం,ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవ్వడం వంటివి..ఆమె పై ఉన్న నెగిటివిటీని కొట్టిపారేశాయి అనే చెప్పాలి. వాళ్ల కోసం ఎన్నో సందర్భాల్లో స్టాండ్ తీసుకుంటూ వచ్చింది కాజల్. సన్నీకి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ రావడానికి ప్రధాన కారణం కూడా కాజల్ అనే చెప్పాలి.

ఓ సందర్భంలో సన్నీ కోసం హోస్ట్ నాగార్జునతో కూడా కోల్డ్ వార్ కు దిగింది కాజల్.ఏది ఏమైనా తన పై ఏర్పడ్డ నెగిటివిటీని కాజల్ కొట్టిపారేసింది. టాప్ 5 లో నిలవలేకపోయినప్పటికీ 14వ వారం వరకు హౌస్ లో కొనసాగింది. ఇక ఈ 98 రోజులకి గాను కాజల్ ఎంత పారితోషికం తీసుకుని ఉండచ్చు అనే అనుమానం ప్రేక్షకుల్లో నెలకొంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం పై చాలా డిస్కషన్లు జరుగుతున్నాయి.

అందుతున్న సమాచారం ప్రకారం… ఒక్కో వారానికి గాను కాజల్ కు రూ. 2 లక్షల పైనే పారితోషికం ఆఫర్ చేశారట ‘బిగ్ బాస్’ నిర్వాహకులు! అంటే 14 వారాలకుగానూ కాజల్‌ కు 30 లక్షల పైనే పారితోషికం అందిందని తెలుస్తోంది. ఓ సందర్భంలో తనకి రూ.30 లక్షల అప్పు ఉందని కాజల్‌ చెప్పుకొచ్చింది.’బిగ్ బాస్5′ పారితోషికం వల్ల ఆమె అప్పులన్నీ క్లియర్ అవుతాయేమో చూడాలి..!

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus