Kajal: కొడుకు ఫొటో షేర్ చేస్తూ కాజల్ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకి నీల్ అనే పేరు పెట్టుకున్నారు కాజల్. ప్రస్తుతం తన బిడ్డ, ఫ్యామిలీతో కలిసి మదర్ హుడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మదర్స్ డే సందర్భంగా కాజల్ తన కొడుకు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాజల్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు నీల్ తో సరదాగా ఉన్న ఫొటోలను కూడా షేర్ చేసింది.

ఓ ఎమోషనల్ నోట్ ను కూడా షేర్ చేసింది. ‘డియరెస్ట్ నీల్.. నువ్ నా లైఫ్ లో ఎంత విలువైనవాడివో తెలుసుకోవాలనుకుంటున్నాను. నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న ఆ క్ష‌ణాలు. నీ చిన్ని చేతుల‌ను నా చేతితో ప‌ట్టుకున్న‌ప్పుడు నీ వెచ్చని శ్వాస నాకు త‌గిలింది. నీ అంద‌మైన క‌ళ్ల‌ను చూశాను. నాకు తెలుసు.. నేను ఎప్ప‌టికీ నీ ప్రేమ‌లోనే ఉంటాను. నువ్వు నా మొద‌టి బిడ్డ‌వు. భ‌విష్య‌త్తులో నిజంగా నువ్వే నా జీవితంలో మొద‌టి వ్య‌క్తివి.

ఓ అమ్మగా ఎలా ఉండాలని నువ్వు నాకు చాలా విషయాలను నేర్పించావు. నిస్వార్ధంగా ఉండేలా నేర్పించావు. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించావు. నా హృదయంలో ఓ భాగం శరీరం వెలుపల ఉండటం సాధ్యమేనని తెలిసేలా చేశావు. ఇంకా నేను నేర్చుకోవాల్సిన విష‌యాలు చాలానే ఉన్నాయి. ఈ విష‌యాల‌ను నేను మొట్ట మొద‌టిగా నేర్చుకోవ‌డానికి కార‌ణ‌మైన వ్య‌క్తిగా నువ్వు ఉన్నందుకు థాంక్స్‌. అది మ‌రెవరూ చేయ‌లేరు. నువ్వు స్ట్రాంగ్ గా మంచి హృద‌యం ఉన్న వ్య‌క్తిగా ఎద‌గాల‌ని, ఇత‌రుల‌పై మంచి మ‌న‌సుని చూపే వ్య‌క్తిగా ఉండాల‌ని కోరుకుంటున్నాను.

నీ ప్ర‌కాశ‌వంత‌మైన గొప్ప వ్య‌క్తిత్వంతో ఈ ప్ర‌పంచాన్ని మ‌స‌క‌బార‌నివ్వ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నాను. నీకు ధైర్యం, ద‌య‌, ఉదార‌త‌, స‌హ‌నం ఉండాలి. ఇవ‌న్నీ నీలో ఉన్నాయ‌ని నాకిప్ప‌టికే తెలిసింది. నువ్వు నావాడివ‌ని చెప్ప‌డం నాకెంతో గ‌ర్వంగా ఉంది” అంటూ రాసుకొచ్చింది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus