Kajal: గొప్పతల్లిగా నిలిచి తగిన సమాధానం చెబుతా.. కాజల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా కాజల్ ప్రస్తుతం తెలుగులో రీఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే గర్భవతిగా ఉన్న సమయంలో తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్ల గురించి కాజల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో లావయ్యానని కొంతమంది విమర్శించారని ఆమె అన్నారు. కొంతమంది తనపై విమర్శలు చేసినా ఆ విమర్శలను నేను పెద్దగా పట్టించుకోలేదని కాజల్ పేర్కొన్నారు.

బిడ్డకు జన్మినిచ్చిన కొన్నిరోజులకే తాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే తాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంపై కూడ నెగిటివ్ కామెంట్లు వచ్చాయని కాజల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తన కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్ది గొప్పతల్లిగా నిలుస్తానని కాజల్ చెప్పుకొచ్చారు. నాపై నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లకు తగిన సమాధానం చెబుతానని కాజల్ పేర్కొన్నారు. కాజల్ పారితోషికం 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

బాలయ్య (Kajal) కాజల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కాజల్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తుండటం గమనార్హం. కాజల్ కు సెకండ్ ఇన్నింగ్స్ లో మరీ ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోలను పంచుకుంటున్నారు. కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కాజల్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాజల్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాజల్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. సీనియర్ స్టార్ హీరోలు కాజల్ కు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus