విడాకులు తీసుకున్న 10 ఏళ్లకు.. ఇదే ట్విస్టు..!

సినీ పరిశ్రమకు చెందిన భార్యాభర్తలు ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ కలిశారు అంటే అది కచ్చితంగా హాట్ టాపిక్ అవుతుంది. అలాంటిది ఓ నటి తన మాజీ భర్తకి సర్ప్రైజ్ ఇవ్వడం అనేది మామూలు హాట్ టాపిక్ అవుతుందా? అలాంటి విశేషం గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. కోలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్లలో శాండీ మాస్టర్ కూడా ఒకరు. అతను నటి కాజల్ పశుపతిని 2009 లో వివాహం చేసుకున్నాడు.

కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శాండీ మరో అమ్మాయి అయిన సిల్వియాను పెళ్లి చేసుకున్నాడు. ఇక కాజల్ ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. అయితే ఓ అనాధని దత్తత తీసుకుని సింగిల్ మదర్ అనిపించుకున్నట్టు అప్పట్లో టాక్ నడిచింది. ఈమె అల్లు శిరీష్ నటించిన ‘గౌరవం’ సినిమాలో సుమతి అనే పాత్రను పోషించింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె తన మాజీ భర్త ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

విడాకులు తీసుకున్న పదేళ్లకు ఆమె శాండీ ఇంటికి వెళ్లడంతో.. అతని ఫ్యామిలీ కూడా షాక్ కు గురైనట్టు తెలుస్తుంది. కాజల్.. శాండీ భార్య సిల్వియా, ఇద్దరు పిల్లలు లాలా, షాన్ మైఖేల్ తో మాట్లాడి కాసేపు సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను కాజల్ తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో.. . ‘విడాకుల తర్వాత కూడా ఫ్రెండ్ షిప్ కొనసాగించడం మంచి పరిణామం’ అంటూ వీరి ఫాలోవర్స్ కామెంట్స్ పెడుతున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus