​శర్వా నుంచి భారీగా ఎక్స్ పెక్ట్ చేస్తోంది!

ఒకవైపు గ్యాంగ్‌స్టర్ పాత్రకోసం అని హీరో శర్వానంద్ గడ్డం పెంచేసి కూర్చున్నాడు. అయితే ఈ సినిమాకు హీరోయిన్లు మాత్రం వరస ఝలక్ లు ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఒక సినిమా త్వరలోనే ప్రారంభం కావాల్సి ఉంది. ఇటీవలే మహానుభావుడుతో హిట్ ను అందుకున్న శర్వానంద్ మంచి ఉత్సాహంతో ఉన్నాడు. అయితే హీరోయిన్లు మాత్రం ఈ సినిమాకు సహకారం అందించడం లేదు.

ముందుగా ఈ సినిమాలో నిత్యామీనన్ ను ఒక హీరోయిన్ గా అనుకున్నారు. అయితే ఆమె మొదట ఓకే చెప్పి, తన పాత్రకు ప్రాధాన్యత లేదన్న కారణం చేత ఎగ్జిట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను అనుకుంటున్నారు. అయితే.. ఈమె భారీ పారితోషకం అడుగుతోందని సమాచారం. ఒకవైపు వయసు మీద పడుతున్నా కాజల్ కు మళ్లీ ఇప్పుడు వరస పెట్టి అవకాశాలు లభిస్తున్నాయి. మధ్యలో ఈమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టినా.. ఇప్పుడు మాత్రం కాజల్ కు మంచి డిమాండ్ ఉంది.

ఈ నేపథ్యంలో శర్వానంద్ సినిమాలో చేయడానికి భారీ రెమ్యూనరేషన్ ను అడుగుతోందట కాజల్. అంత రెమ్యూనరేషన్ ఇచ్చి కాజల్ ను తీసుకోవడం విషయంలో ఈ సినిమా మేకర్లు ఆలోచనలో పడిపోయారట. జనవరిలో ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే హీరోయిన్ల విషయంలో ఈ పితలాటకం కొనసాగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus