‘నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా? లేదంటే మళ్ళీ నేనే ట్రై చేయనా?’ అంటూ ‘ఏక్ నిరంజన్’ (Ek Niranjan) సినిమాలో ప్రభాస్ తో (Prabhas) ఓ డైలాగ్ చెప్పించాడు దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) . ఈ డైలాగ్ అప్పట్లో పెద్దగా జనాలకి కనెక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ కి కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు టాలీవుడ్లో ప్రభాస్ లీగ్ వేరు అని చెప్పాలి. పాన్ ఇండియా వైడ్ ప్రభాస్ సినిమాలకి వచ్చే ఓపెనింగ్స్ వేరే లెవెల్లో ఉంటున్నాయి.
‘బాహుబలి’ (Baahubali) రేంజ్ ఓపెనింగ్స్.. లేదంటే రాజమౌళి (S. S. Rajamouli) సినిమాల రేంజ్ ఓపెనింగ్స్ ప్రభాస్ సినిమాలకే వస్తున్నాయి. వేరే స్టార్ హీరోల సినిమాల ఫుల్ రన్ కలెక్షన్స్ ప్రభాస్ సినిమాలకి ఓపెనింగ్స్ రూపంలో వచ్చేస్తున్నాయి. మరోపక్క ప్రభాస్ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులు ప్రభాస్ సినిమాలే బ్రేక్ చేస్తుండటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఉదాహరణకి ప్రభాస్ కి ‘సలార్’ (Salaar) (పార్ట్ 1 సీజ్ ఫైర్) కం బ్యాక్ మూవీ అయ్యింది.
గత ఏడాది చివర్లో అంటే డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.695 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. పోటీగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘డంకీ’ (Dunki) సినిమా లేకపోతే ఇంకా ఎక్కువగా కలెక్ట్ చేసి ఉండేది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) సినిమా మొదటి వారమే రూ.700 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ‘సలార్’ ఫుల్ రన్లో సాధించిన కలెక్షన్స్ ని ‘కల్కి 2898 ad ‘ మొదటి వారమే అధిగమించడం విశేషంగా చెప్పుకోవాలి.