ప్రభాస్ (Prabhas) ,దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్లో రూపొందిన ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) సినిమా ఈ ఏడాది జూన్ 27న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా రూ.1100 కోట్లు కలెక్ట్ చేసి ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ ఏంటి.. అనేది మరోసారి ప్రూవ్ చేసింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , దీపికా పదుకొనె (Deepika Padukone) వంటి బాలీవుడ్ స్టార్స్ ఉండటం, మైథలాజికల్ టచ్ ఉన్న మూవీ కావడంతో హిందీలో భారీ వసూళ్లను కొల్లగొట్టింది.
‘కల్కి..’ క్లైమాక్స్ పీక్స్ లో ఉంటుంది. అది సినిమాకు మరింత ప్లస్ అయ్యింది అని చెప్పవచ్చు. ‘కల్కి 2’ కి ఇచ్చిన లీడ్ కూడా అందరికీ బాగా నచ్చింది. పార్ట్ 2 కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది ‘కల్కి..’. విషయం ఏంటంటే.. త్వరలో ‘కల్కి 2898 AD’ చిత్రం జపాన్లో విడుదల కాబోతుంది. ‘కల్కి 2898 AD’ అనేది కేవలం పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు..
ఇది పాన్ వరల్డ్ సినిమా.వాస్తవానికి ఏక కాలంలోనే ‘కల్కి..’ని జపాన్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పలుమార్లు విడుదలను వాయిదా వేశారు. అందువల్ల జూన్ 27న జపాన్ లో విడుదల చేయలేకపోయారు. అందుకే 2025 జనవరి 3న జపాన్ లో ‘కల్కి 2898 ad’ విడుదల కానుంది. ప్రభాస్ గత సినిమాలు ‘సాహో’ (Saaho) ‘సలార్’ (Salaar) వంటివి జపాన్ లో లేట్ గా రిలీజ్ అయినా.. అక్కడ మంచి వసూళ్లు సాధించాయి. కాబట్టి.. ‘కల్కి..’ కూడా భారీ వసూళ్లు సాధిస్తుంది అని అంతా భావిస్తున్నారు.