Kalki: ప్రభాస్ మూవీకి పోటీగా హాలీవుడ్ మూవీ.. ఆ మూవీకే నష్టమంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ సలార్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. సలార్ మూవీ 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇప్పటికీ చెప్పుకోదగ్గ థియేటర్లలో సలార్ మూవీ ప్రదర్శితమవుతోంది. సలార్ సినిమాకు ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది. మరోవైపు ప్రభాస్ తర్వాత మూవీ కల్కి 2898 ఏడీ మే నెల 9వ తేదీన రిలీజ్ కానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన మెజారిటీ సినిమాలు మే నెల 9న విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కల్కి 2898 ఏడీ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే ప్రభాస్ సినిమాకు పోటీగా కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా రిలీజవుతోంది.

సలార్ సినిమాకు పోటీగా ఆక్వామేన్2 విడుదల కాగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అయితే ప్రభాస్ సినిమాకు పోటీగా రిలీజ్ కావడం వల్ల హాలీవుడ్ సినిమాకే నష్టమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస షూటింగ్ లతో ప్రభాస్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రభాస్ సినిమాలకు సంబంధించి వరుస అప్ డేట్స్ వస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

ప్రభాస్ కల్కి 2898 ఏడీ , ప్రభాస్ మారుతి కాంబో సినిమాలకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ ఉండటం ఆయనకు కెరీర్ పరంగా ప్లస్ అవుతోంది. రాబోయే రోజుల్లో ప్రభాస్ తన రేంజ్ ను పెంచుకునేలా మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. స్టార్ హీరో ప్రభాస్ సినిమాల బడ్జెట్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus