సమంత మయోసైటిసిస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కల్పికా!

సమంత ప్రస్తుతం మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె ఈ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో కనీసం నడవడానికి కూడా శక్తి లేకపోవడంతో యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అన్నింటికి పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈమె మెల్లిమెల్లిగా కోలుకుంటూ ఉన్నారు.సమంత మయో సైటీసెస్ వ్యాధితో బాధపడుతున్నానని తెలియగానే చాలామంది అసలు ఈ వ్యాధి ఏంటి అని ఈ వ్యాధి గురించి పెద్ద ఎత్తున తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు.

ఇక మయోసైటీస్ వ్యాధి వివిధ రకాలుగా ఉంటుందని కొందరికి చర్మానికి వస్తే మరికొందరిలో కండరాలు తీవ్రమైన నొప్పులకు గురి చేస్తూ ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ వ్యాధి సోకినవారు పూర్తిగా తమ ఎనర్జీ లెవెల్ పడి పోవడమే కాకుండా తొందరగా నీరసించిపోవడం అలసిపోవడం జరుగుతుంది. అయితే సమంత ఈ విధమైనటువంటి వ్యాధితో బాధపడటంతో పూర్తిగా ఆమె చికిత్స తీసుకుంటూ త్వరగా ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి సమంత యశోద సినిమా ప్రమోషన్లకు సక్సెస్ మీట్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. అయితే సమంతతో పాటు యశోద సినిమాలో నటించిన నటి కల్పిక గణేషన్ సైతం మయో సైటీసెస్ వ్యాధి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం సమంత మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతూ మూడవ స్టేజ్ లో ఉంది. తాను మొదటి స్టేజ్ లో ఉన్నానని కల్పిక తెలిపారు. సమంతను కలిసి ఈ విషయం గురించి పలు విషయాలు మాట్లాడాలనుకుంటున్నాననీ ఈ సందర్భంగా కల్పిక గణేషన్ మయోసైటిస్ వ్యాధి గురించి తెలియజేశారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus