Kalyan Dev: ఆ వార్తల్లో నిజం లేదంటున్న కళ్యాణ్ దేవ్!

సమంత నాగచైతన్య విడాకుల ప్రకటన తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరో జంట విడిపోనున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఐదు సంవత్సరాల క్రితం కళ్యాణ్ దేవ్ శ్రీజ వివాహం జరగగా ఈ జంటకు నవిష్క అనే పాప ఉన్నారు. అయితే వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని గత కొన్నిరోజులుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మెగా ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్న దీపావళి సెలబ్రేషన్స్ లో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో వైరల్ అయిన రూమర్లు నిజమేనని చాలామంది భావించారు.

మరోవైపు కళ్యాణ్ దేవ్ తో కలిసి ఉన్న ఫోటోను శ్రీజ ఈ మధ్య కాలంలో పోస్ట్ చేయకపోవడంతో కొంతమంది ఈ వార్తలలో నిజం ఉండవచ్చని అనుకున్నారు. అయితే కళ్యాణ్ దేవ్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో శ్రీజతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి ఈ రూమర్లకు చెక్ పెట్టారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా కళ్యాణ్ దేవ్ శ్రీజకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కళ్యాణ్ దేవ్ చెప్పకనే చెప్పేశారు.

విజేత సినిమాతో కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి, కిన్నెరసాని సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. కళ్యాణ్ దేవ్ హీరోగా మరికొన్ని సినిమాలకు సంబంధించిన ప్రకటనలు త్వరలో వెలువడే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. తొలి సినిమాతో ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోని కళ్యాణ్ దేవ్ తరువాత సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus