Bimbisara Movie: బింబిసార విషయంలో కళ్యాణ్ రామ్ నమ్మకం నిజమవుతుందా?

ప్రముఖ టాలీవుడ్ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా నాలుగు వారాల తర్వాత థియేటర్లలో రిలీజ్ కానుంది. 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సులువుగా బ్రేక్ ఈవెన్ అవుతుందా అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ ఒక విధంగా రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి.

ఈ మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. కళ్యాణ్ రామ్ కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారనే సంగతి తెలిసిందే. బింబిసార కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ పై తెరకెక్కడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన బింబిసార ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కుల వివరాలు తెలియాల్సి ఉంది.

శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి విక్రయించినా 30 నుంచి 35 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే మాత్రమే ఈ సినిమా సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కేథరిన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించడం గమనార్హం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య, ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే బింబిసార పార్ట్2, పార్ట్3, పార్ట్4 కూడా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది. మొత్తం నాలుగు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నామని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా నిజంగానే నాలుగు భాగాలుగా తెరకెక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus