హలో హీరోయిన్ కి భారీ ఆఫర్లు

హలో సినిమాతో అక్కినేని ప్రిన్స్ అఖిల్ విజయం అందుకున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా మలయాళ సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి హీరోయిన్ గా పరిచయమయింది. ఈమె తొలి చిత్రంతోనే తెలుగువారి మనసును దోచుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మించిన ఈ చిత్రంతో కళ్యాణి క్రేజీ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లోనే కాకుండా మల్లూవుడ్ నుంచి నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నట్లు తెలిసింది. అంతేకాదు అక్కినేని నాగచైతన్య కి జంటగా నటించమని హలో సినిమా షూటింగ్ సమయంలోనే అడిగారంట.

కానీ ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఇప్పుడు కూడా భారీ రెమ్యునరేషన్ ఇస్తామని చెబుతున్నప్పటికీ నో చెబుతుందంట. కథతో పాటు అందులో తన పాత్రకి ప్రాముఖ్యత ఉంటేనే చేస్తానని రూల్స్ పెడుతోందంట. ఇప్పుడు కమర్షియల్ సినిమా కథల్లో హీరోయిన్ గ్లామర్ డాల్ గానే చూపిస్తున్నారు. అలాంటి రోల్స్ అసలు చేయనని మొహం మీదే వెల్లడిస్తోంది ఈ భామ. ఎంతైనా డైరక్టర్ కూతురు కదా.. ఆ మాత్రం కథ, క్యారెక్టర్స్ పై అవగాహన ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే మాతృభాషలో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేయాలనీ కళ్యాణి నిర్ణయించుకుంది. మరి ఆమెను మెప్పించే క్యారెక్టర్స్ ఏ డైరక్టర్ సిద్ధం చేస్తారో.. చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus