మరో స్టార్ హీరో చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన అఖిల్ భామ..!

అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘హలో’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయమయ్యింది కల్యాణి ప్రియదర్శన్. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో హిట్టవ్వకపోవడంతో ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఈ చిత్రంలో తన నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఎట్టకేలకు సాయితేజ్ ‘చిత్రలహరి’ లో అవకాశం దక్కించుకుంది. కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కాబోతుంది. ఈ చిత్రం హిట్టయితే ఇక్కడ మంచి అవకాశాలు దక్కే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ అమ్మడికి తమిళంలో మాత్రం వరుస అవకాశాలు వస్తుండడం విశేషం.

ఇప్పటీకే తమిళంలో ఆమె శివకార్తికేయన్ సరసన ‘హీరో’ అనే చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం అలా సెట్స్ పైకి వెళ్ళిందో లేదో .. మరో ప్రాజెక్టుకు కల్యాణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. కోలీవుడ్ క్రేజీ హీరో శింబు… వెంకట్ ప్రభు డైరెక్షన్లో చేయబోయే ఓ చిత్రంలో కల్యాణిని హీరోయిన్ గా ఎంచుకున్నారట. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ చిత్రానికి ‘మాన్నాడు’ అనే టైటిల్ ను ఖరారు చేశారట. ఈ చిత్రం కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రెండు చిత్రాలు హిట్టయితే ఆమెకు స్టార్ స్టేటస్ రావడం ఖాయం అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus