కళ్యాణి ప్రియదర్శన్ మనసులో మాట

అక్కినేని నాగార్జున నిర్మాతగా ఆయన తనయుడు అఖిల్ హీరోగా రూపొందిన హలో చిత్రంలో హీరోయిన్‌గా కల్యాణి ప్రియదర్శన్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అందంతోనే కాదు అభినయంతో కూడా కల్యాణి మెప్పించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. సినిమా బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో సినీ రంగంలోకి అడుగుపెట్టిన కల్యాణి గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకొన్న తర్వాత కల్యాణి భారీ కసరత్తే చేసింది. ఒకప్పుడు బొద్దుగుమ్మలా ఉండే ఆమె నాజుకుగా మారింది. అందంగా కనిపించడానికి దాదాపు 25 కిలోల బరువు తగ్గింది. కల్యాణి ప్రియదర్శన్‌ తమిళంలో నజ్రియా, హిందీలో అలియాభట్ ఇష్టమట.

ఇక మలయాళంలో మోహన్ లాల్, హిందీలో రణ్‌వీర్ సింగ్ తనకు ఫేవరేట్ హీరోలు. వీరి సినిమాలను మిస్‌కాకుండా చూడటం కల్యాణికి అలవాటు. హీరోయిన్‌గా మారిన తర్వాత నాకు అమ్మ లిజితో నటించాలని అనిపిస్తున్నది. అమ్మతో నటించే అవకాశం వస్తే మాత్రం అసలే వదులుకోను. తల్లితో తెర మీద కనిపించడం కంటే ఆనందం ఏమి ఉంటుంది అని కల్యాణి ప్రియదర్శన్ చెప్పింది.పెళ్లి గురించి కూడా కల్యాణి స్పష్టమైన అవగాహనతోనే ఉంది. 2022లో తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లాడుతానంటుంది ఈ ముద్దుగుమ్మ. చాలారోజులుగా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌గా ఉంటున్న రితుల్ బ్రూస్ లీని పెళ్లాడుతానని కల్యాణి చెబుతున్నది. అప్పటివరకు వారిద్దరూ ప్రేమలోనే ఉంటారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus