కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla) పరిచయం అవసరం లేని పేరు. ‘మా ఊరి పొలిమేర’ ‘విరూపాక్ష’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ‘జాన్సీ’ ‘సైతాన్’ వంటి వెబ్ సిరీస్లలో కూడా నటించింది. ‘మా ఊరి పొలిమేర 2 ‘ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఆమె రేంజ్ ఇంకా పెరిగింది. స్వతహాగా ఈమె డాక్టర్. సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఈ రంగంలోకి అడుగుపెట్టింది.
‘పొలిమేర’ ‘పొలిమేర 2′ సినిమాలకి రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ చాటుకుంది. అయితే ఈమె ఎక్కువగా థ్రిల్లర్, హర్రర్ వంటి సినిమాల్లోనే చేస్తుంది అనే కంప్లైంట్ ఉంది. తాజాగా జరిగిన ’12A రైల్వే కాలనీ’ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో ఈ విషయం పై స్పందించింది.’కామాక్షి గారు మీరేంటి.. ఎప్పుడూ హర్రర్, థ్రిల్లర్ సినిమాలు తప్ప వేరే సినిమాలు ఏమీ చేయరా?’ అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు.

అందుకు కామాక్షి.. “నేను కూడా వెయిటింగ్ అండి. నేను ‘పొలిమేర’ లో ఓ గ్రామీణ గృహిణిగా చేశాను. తర్వాత అలాంటి పాత్రలే వచ్చాయి. మన ఇండస్ట్రీలో ఒక పాత్ర చేసి సక్సెస్ అయితే.. వరుసగా అలాంటి పాత్రలే వస్తాయి. నా విషయంలో కూడా అదే జరుగుతుంది. దేనికీ కూడా నో చెప్పలేని పరిస్థితి” అంటూ చెప్పుకొచ్చింది.కామాక్షి చెప్పింది చాలా వరకు కరెక్ట్.
మన టాలీవుడ్లో ఎక్కువగా సహా నటులకి.. గత సినిమాల్లో చేసిన పాత్రల్లాంటివే ఇస్తూ ఉంటారు. నటీనటులు కూడా వచ్చిన ఆఫర్లకి నో చెబితే.. కొత్త సినిమాల్లో అవకాశాలు రావేమో అనే ఉద్దేశంతో ఆబ్లిగేషన్ కొద్దీ ఓకే చేసేస్తుంటారు.
