కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ (Thug Life) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన గ్లింప్స్ కూడా ఇటీవల రిలీజ్ అయ్యింది. దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. 37 ఏళ్ళ తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కాబట్టి… తమిళంలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో కూడా ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో ప్రమోషన్స్ ను కూడా గ్రాండ్ గా మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్లో.. హీరోయిన్ త్రిష (Trisha) గ్లామర్ సీక్రెట్ ఏంటని యాంకర్ ప్రశ్నించడం జరిగింది. అందుకు త్రిష తన డైట్ గురించి చెబుతున్న క్రమంలో.. ‘అరటిపండుని బాయిల్ చేసి తినడాన్ని ఎక్కువగా ఇష్టపడతాను’ అంటూ ఆమె చెప్పింది. అందుకు కమల్ హాసన్… ‘పేరు ఏంటో తెలీదు..
కానీ దాన్ని నోట్లో పెట్టుకుని తినడం మాత్రం బాగా తెలుసు’ అంటూ త్రిషకి సెటైర్ విసిరాడు. అందుకు త్రిషతో పాటు అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. అయితే తర్వాత కమల్ హాసన్ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో కవర్ చేసే ప్రయత్నం చేశారు. త్రిష కూడా ‘కమల్ సార్ చాలా ఫన్నీ.. సెట్స్ లో కూడా ఇలానే ఉంటారు’ అంటూ చెప్పి కవర్ డ్రైవ్ విసిరింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
— Amuthabharathi Videos (@Videos0123) April 20, 2025