విశ్వనటుడు, యూనివర్సల్ స్టార్.. వెర్సటైల్ యాక్టర్, రైటర్, సింగర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్.. నటనకు నిలువెత్తు నిదర్శనం.. విలక్షణ అనే పదానికి విశ్వవిద్యాలయం.. కమల్ హాసన్.. బాల నటుడిగా పరిచయమై.. ఐదు దశాబ్దాలకు పైగా కెరీర్ కొనసాగిస్తున్నారాయన.. ఆయన చేయని ప్రయోగాలు, తన నటనతో ప్రాణం పోసిన పాత్రలు అద్భుతం.. తెలుగు, తమిళ నాట స్టార్‌గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని, అభిమానుల్ని సొంతం చేసుకున్నారు కమల్.. ప్రొఫెషనల్ లైఫ్ వరకు ఆయన కింగ్ అయితే..
పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.. అధికారికంగా రెండు పెళ్లిళ్లు.. ఓ సహజీవనం.. ఇది కమల్ గురించి తెలిసింది కానీ తెలియని చాలానే ఉన్నాయి.. ఆయన మొదట హీరోయిన్ శ్రీవిద్యను ప్రేమించానని చెప్పి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారట.. ఈ విషయం స్వయంగా ఆమే ఓ ఇంటర్వూలో చెప్పారు.. ‘‘మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం.. చేసుకోవలసిందే.. పైగా మా రెండు కుటంబాలూ చాలా ఏళ్లుగా ఒకరికొకరం తెలుసు.. మా అమ్మ ప్రముఖ కర్ణాటక సంగీత గాయనీమణి ఎమ్.ఎల్. వసంత కుమారి..
మా పేరెంట్స్ మధ్య గొడవలొచ్చి నా చిన్నప్పుడే విడిపోయారు.. పని బిజీ వల్ల మా అమ్మకు నన్ను పట్టించుకునే తీరిక ఉండేది కాదేమో.. అంచేత నేను 13వ ఏటనే సినిమాల్లో చేరాను.. ఈ హీరో (కమల్ హాసన్) నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పేటప్పటికి నా వయసు 22.. ఆయన ఆ మాట అన్నప్పటినుంచి మనసా వాచా ఆయనను ఆరాధించటం, ఆయన చెప్పినట్టు చేయటం మొదలెట్టాను.. ఆయన కోసమే బతకాలనీ, నా జీవితాన్ని ఆయనకే అంకితం చెయ్యాలనీ ఎదరు చూశాను.. ఆరోజు రానే లేదు..
హఠాత్తుగా ఓరోజు వచ్చి ఓ డ్యాన్సర్‌ను (కమల్ మొదటి భార్య వాణీ గణపతి క్లాసికల్ డ్యాన్సర్).. పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు.. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు.. ఈ పెళ్లి జరగాల్సిందే.. కానీ నాకోసం ఎదురు చూడు అన్న ఆ హీరో మాటలు ఇప్పటికీ నాకు గుర్తే’’ అని ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చారు శ్రీవిద్య.. అయితే కమల్ కోసం శ్రీవిద్య ఎదురు చూడలేదు.. కమల్ తర్వాత తనతో ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసిన డైరెక్టర్ భరతన్ తో కొన్నాళ్లు రిలేషన్‌లో ఉంది..
అతనితో బ్రేకప్ తర్వాత.. తల్లి ప్రేమ, ప్రియుడి ఆదరణ కరువైన ఆ దశలో కాస్త సన్నిహితంగా మెలిగిన మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన జార్జ్ థామస్‌ని పెళ్లాడింది.. అందుకుగానూ తన మతం కూడా మార్చుకుంది.. కొద్ది కాలానికే విడిపోయారు.. తర్వాత ఆయన మరో పెళ్లి చేసుకున్నాడు.. చాలా కాలం పాటు కేసులు, గొడవలు, వివాదాలతో ఆమె విసిగిపోయింది.. 2003లో స్పైన్ క్యాన్సర్‌కి గురైన శ్రీవిద్య 2006 ఆగస్టు 17న కన్నుమూశారు.. అప్పటికే తన ఆస్తిని ఛారిటీకి రాసిచ్చేశారామె..