Jr NTR,Kamal Haasan: ఎన్టీఆర్ కి విలన్ గా స్టార్ హీరో కమల్ హాసన్!

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో పాటు ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయగా..

ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. డార్క్ థీమ్ తో ఈ పోస్టర్ ఉంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ నటించబోతున్నారట. ఇటీవల ప్రశాంత్ నీల్.. కమల్ కి కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఇందులో కమల్ హాసన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తారని టాక్. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోలను, విలన్స్ ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తారు.

అందుకే కమల్ హాసన్ ఈ సినిమా ఒప్పుకున్నట్లు టాక్. మరి దీనిపై ఎంతవరకు నిజముందనే విషయంలో క్లారిటీ లేదు. చిత్రబృందం ఈ వార్తలపై స్పందిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తరువాత ఎన్టీఆర్ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు. ఈ సినిమా ‘కేజీఎఫ్’ రేంజ్ లో ఉంటుందని ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఎన్టీఆర్ చెప్పారు. దీంతో అంచనాలు మరింత పెరిగాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus